
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మంలో శుక్రవారం నుంచి డోలోత్సవం ప్రారంభం కానుంది. తొలి రోజు రాత్రి 10 గంటల నుంచి కామదహనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ఫల్గుణ మాస త్రయోదశి నాడు మఘ నక్షత్రంలో జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. తొలుత స్వామి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలలతో తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం గ్రామ సమీపంలోని కామదహనం మంటపం వద్ద కామదహన కార్యక్రమా న్ని వేదపండితులు నిర్వహిస్తారు. వరుసగా శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు సముద్ర స్నానాలు (పడియా) జరుగుతాయి. అనంతరం శ్వేతపుష్కరిణిలో పవిత్ర స్నానాలాచరిస్తారు. సోమవారం ఉదయం డోలో మంటపంలో స్వామి ఉత్తరాభిముఖదర్శనం ఇస్తారు.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ డోలోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు, 23, 24వ తేదీల్లో పడియా, 25వ తేదీన డోలోత్సవం నిర్ఆవహించనున్లనట్యలు ఈఓ జి.గురునాథం తెలిపారు.





