News

వంశధారలో పురాతన విగ్రహాల గుర్తింపు

336views

పార్వతీపురం మన్యంజిల్లా భామిని గ్రామీణ మండలంలోని నేరడి బ్యారేజీ వద్దగల వంశధార నదిలో దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ఆదివారం వంశధార ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికులు నదిలో స్నానాలకు వెళ్లే సమయంలో వీటిని గుర్తించారు. అయిదు దేవతా విగ్రహాలతో పాటు నంది, ఇతర శిలలను ఒడ్డుకు తెచ్చారు. వాటిని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి జనం తరలి వస్తున్నారు. కొందరు పూజలు చేస్తున్నారు. వరదల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.