News

18 మంది పాకిస్థానీ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం

362views

పాకిస్తాన్ లో మతపరమైన వివక్ష,పీడనను తాళలేక సరిహద్దులకు సమీపంలోని గుజరాత్ లో ఆశ్రయం పొందుతున్న 18 మంది హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం లభించింది. అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమం లో వీరికి ఆ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజే శారు. అహ్మదాబాద్ జిల్లా ఇప్పటి వరకు 1,167 మంది హిందువులకు పౌరసత్వం లభించినట్లు ఆయన తెలిపారు. ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన సీఏఏ చట్టం ప్రకారం ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం మంజూరు చేసే అధి కారం అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లాల కలె క్టర్లకు కల్పిస్తూ ప్రభుత్వం గజెట్ జారీ చేసింది.