
230views
ఎస్టీ జాబితాలో కొత్తగా చేర్చిన నాలుగు తెగలు(గడ్డ బ్రాహ్మణులు, కోలి, పెద్దారి తెగ, పహారి జాతి సమూహం)కు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం ఎస్టీల రిజర్వేషన్లు 20 శాతానికి చేరాయి. అదేవిధంగా 15 సామాజిక వర్గాలను ఓబీసీల్లో కలపడానికి యంత్రాంగం ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఓబీసీ రిజర్వేషన్లను 8 శాతానికి పెంచింది. ఫిబ్రవరిలో పార్లమెంటులో చేసిన చట్టానికి అనుగుణంగా సాంఘిక సంక్షేమ విభాగం చేసిన ప్రతిపాదనలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో పాలక మండలి సమావేశమై ఆమోదించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.





