
210views
దేహమే దేవాలయం జీవుడే దేవుడని తెలుసుకొని జీవించడమే ఉత్తమ మానవ ధర్మమని త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ భక్తులకు ఉపదేశించారు. కర్నూలు శివారులోని గోదా గోకులంలో వెలసిన శ్రీ గోదా దేవి సమేత రంగనాథస్వామి దేవస్థానంలో చేపట్టిన వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం ఆయన హాజరై భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భక్తులందరికీ తీర్థ గోష్టి, ఉత్సవ వరులకు స్నపన తిరుమంజనం, చతుస్థానార్చన హోమం, నివేదన, పూర్ణాహుతి, బలి ప్రదానం, శాత్తుమొర, తీర్థ ప్రసాద వినియోగం, స్వామివారికి సూర్య ప్రభ వాహన సేవ, శ్రీమన్నారాయణాచార్య స్వామి యాజ్ఞకత్వంలో అర్చకులు రమేష్ భట్టర్, కిరణ్ భట్టర్ బృందం ఈ క్రతవులు నిర్వహించారు.





