
మహా శివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్న విశాఖపట్నం బీచ్ లోని నాగ క్షేత్రంలో శివలింగాన్ని బూటు కాళ్ళతో తన్నిన ఫారెస్ట్ ఉద్యోగి చిట్టిబాబు నీ ఉద్యోగం నుంచి భర్తరఫ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు.విశాఖ బీచ్ రోడ్ లోని జోడుగుళ్ల పాలెం వద్ద గల నాగ క్షేత్రంలో హిమాలయ యోగి ప్రభాకర్ జీ ప్రతి ఏటా మహా శివరాత్రి వైభవంగా నిర్వహిస్తుంటారు.ఆ ఏర్పాట్లు లో ఉండగా గురువారం సాయంత్రం అనుమతి లేదంటూ విశాఖ ఫారెస్ట్ అధికారులు వచ్చి మొత్తం ఏర్పాట్లను ధ్వంసం చేశారు.
ఈ క్రమంలోనే చిట్టిబాబు (హైందవేతరులు) మహా శివలింగం పానపట్టం పైకి బూటు కాళ్ళ తో ఎక్కి తొక్కడం కాకుండా పూజా సామాగ్రిని కాలితో తన్నడం భక్తులను ఆవేదనకు గురి చేసింది. మొత్తం సామాగ్రిని. ప్రైవేటు వాహనాల్లో బయటకు తరలించుకుపోయారు.
ఇది దారుణమని, తక్షణమే ఆ అధికారి ని సస్పెండ్ చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. శుక్రవారం నాగ క్షేత్రం లో శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న అనంతరం హిందూ ధార్మిక సంఘాలు, భక్తులతో కలిసి ఆయన బీచ్ రోడ్ లో రాస్తారోకో చేపట్టారు. సందర్భంగా మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా ఇదే ప్రాంగణంలో ఎటువంటి అవాంతరం లేకుండా నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఈ ఏడాది ఫారెస్ట్ అధికారులకు మింగుడు పడలేదని అన్నారు. రాత్రికి రాత్రి సంఘ విద్రోహ శక్తులతో ప్రవర్తించే అహంకార వైఖరిని ఒక సాధారణ ఆశ్రమం పై చూపించిన వ్యక్తి సంఘం లో ఉండకూడదన్నారు.
బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ విజయ్ ఫణి మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో అన్యమత శక్తులు పెట్రేగి పోతున్నాయని మండి పడ్డారు. హిందూ వ్యతిరేక ఉద్యోగులను హిందూ దేవాలయాల పైకి ఉసిగొల్పి మాట కల్లోలాలు రేకెత్తించే ప్రయత్నం కూడా కావచ్చు అని అనుమానం అన్నారు.
విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్ టోలి పుడిపెద్ది శర్మ మాట్లాడుతూ కోట్లాది మండి హిందువుల మనోభావాలు కించ పరిచే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించేది లేదన్నారు. ఏ హిందూ దేవాలయానికి కైన ఇబ్బంది కలిగితే వెంటనే అందుబాటులో ఉండి బాధితులకు అండగా నిలబడుతున్నామన్నారు. మహా శివరాత్రి వేడుకలకు భంగం కలిగించిన ఫారెస్ట్ అధికారి పై వెంటనే వేటు వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా సెల్ కో కన్వీనర్ డి ఎస్ వర్మ, బీజేపీ నగర ఉపాధ్యక్షులు కలిగట్ల సుబ్రహ్మణ్యం, అభిరామ్, వి హెచ్ పి సభ్యులు, విరాట్ హిందూ సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు





