News

మే 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

208views

భక్తుల దర్శనార్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు బద్రీనాథ్‌- కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ(బీకేటీసీ) శుక్రవారం వెల్లడించింది. తీవ్ర మంచు కారణంగా ఆలయాన్ని శీతాకాలంలో మూసివేశారు. గతేడాది యాత్ర సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారని, ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కమిటీ పేర్కొంది. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, త్వరలో పరిశీలకుల బృందం ఆలయాన్ని సందర్శిస్తుందని తెలిపింది.