News

శివయ్యా.. గంగమ్మ ఏ‘దయ’?

204views

శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలోని దుర్గాఘాట్‌కు వచ్చారు. నీరు లేకపోవడంతో అధికారులు నదీస్నానాలకు అనుమతి ఇవ్వలేదు.

నదిలోని నీటిని మోటార్ల ద్వారా తోడి ఘాట్‌ మెట్ల మీద జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు జల్లు స్నానాలు చేశారు. ఆ నీరు అపరిశుభ్రంగా ఉందని.. ఘాట్లో అపరిశుభ్రత, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తగినన్ని గదులు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.