
320views
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి తిరుమల శ్రీవారి తరఫున తితిదే ఈవో ధర్మారెడ్డి సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీశైలం ఆలయ ఛైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తితిదే తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మార్చి 1న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి.





