
331views
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్ వద్ద ఆదివాసి మాతృభాష వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. వాలంటీర్లను మార్చి ఏప్రిల్ నెలలో కూడా బోధకులుగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. బడ్జెట్ లేదని కారణంతో తమ సేవలను ఫిబ్రవరి నెలలోనే నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా మాతృభాషా వాలంటీర్లు పాఠశాలలకు వెళ్ళకపోవడంతో జిల్లాలో సుమారు 50 గ్రామాల్లో పిల్లలు బడికి దూరమయ్యారని తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలలో కూడా తమ సేవలను కొనసాగనించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.





