
అయోధ్యలో ఉన్న హనుమాన్‌గఢీ ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్లకు చేరనుంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది. దీంతో చాలామంది భక్తులకు హనుమాన్‌గఢీ ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ తపాలాశాఖ హనుమాన్ గఢీ ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి.. ‘డిప్యూటీ పోస్ట్‌మాస్టర్, అయోధ్య ధామ్ -224123’ చిరునామాతో ఈ-మనీ ఆర్డర్ తీయాలి. భక్తుల చిరునామా ఇచ్చిఆర్డర్ చేయాలి. పిన్‌కోడ్, ఫోన్ నంబరు తప్పనిసరి. ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్‌పోస్టు ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపుతామని ప్రయాగ్‌రాజ్, వారణాసి జోన్ పోస్ట్‌మాస్టర్ కృష్ణకుమార్ తెలిపారు. రూ.251 మనీఆర్డర్‌కు లడ్డూలు, హనుమాన్ చిత్రం, మహావీర్ గంధం, అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు.





