News

మహానందికి చేరుకున్న కంచి కామకోటి పీఠాధిపతి

238views

మహానంది పుణ్యక్షేత్రానికి ఆదివారం జగద్గురువు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేరుకున్నారు. ఆయన చేపట్టిన ధర్మ యాత్రలో భాగంగా మహానందికి రావడంతో ఈవో కాపు చంద్రశేఖరరెడ్డి, ఆలయ ప్రధానార్చకులు మామిళ్లపల్లి అర్జున శర్మ, వేద పండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శ,ర్మ హనుమంతరాయ శర్మ భక్తులు పీఠాధిపతికి ఘన స్వాగతం పలికారు. రెండు రోజులపాటు మహానంది క్షేత్రంలో ఉండనున్నారు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన మహానందీశ్వర స్వామి సహిత కామేశ్వరీ దేవి అమ్మవార్లకు విశేష అభిషేకాలు అర్చనలు చేయనున్నారు.