News

1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

255views

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు శనివారం తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తులకు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి అలంకార దర్శనం ఏర్పాటు చేయనున్నారు. దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌, కరెంట్‌ బుకింగ్‌ ద్వారా పొందవచ్చని ఈవో చెప్పారు. జ్యోతి ఇరుముడులు కలిగిన శివదీక్షా భక్తులకు మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు విడతల వారీగా స్పర్శ దర్శనం కల్పిస్తామని తెలిపారు.