
387views
జ్ఞానవాపి మసీదు భూగర్భగృహంలో పూజలు నిలిపివేయాలని కోరుతూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు ఈ నెల 15న విచారించనుంది. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు విచారణ ఈ నెల 12న జరగనుందని, దీంతో జిల్లా కోర్టులో ఇప్పుడు విచారించి ప్రయోజనం ఉండదని హిందువుల తరఫు న్యాయవాది యాదవ్ తెలపడంతో న్యాయమూర్తి వాయిదా వేశారు. పూజలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం అలహాబాద్ హైకోర్టు విచారించనుంది.




