
380views
జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగనున్న వేళ ఓ కళాకారుడు గీసిన అద్భుత 3డీ పెయింటింగ్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. అక్బర్ మొమిన్ గీసిన ఆ పెయింటింగ్‌లో పైకి హనుమాన్ చిత్రం కనిపిస్తుండగా, దాని ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు శ్రీరాముడు దర్శనమిస్తున్నాడు. మొమిన్ కళా ప్రతిభను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.





