News

శ్రీశైలంలో కార్తిక దీపారాధనలు భారీగా తరలివచ్చిన భక్తులు

220views

కార్తికమాసంలో చివరి కార్తిక సోమవారం కావడంతో రెండు రాష్ట్రంలోని శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో చివరి సోమవారం కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

చివరి కార్తిక సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నామని శ్రీశైల దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.