
269views
అయోధ్యలో నిర్మాణం తుది దశకు చేరుకున్న రామమందిరంలో పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. రామ మందిరంలో అర్చకుల పోస్టులకు సంబంధించి దాదాపు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. వీరిలో 200 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. వీరిలో 20 మందిని ఎంపిక చేయనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు
మరోవైపు.. 14వ అయోధ్య నగర ప్రదక్షిణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 2 గంటలకు నగర ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ ప్రదక్షిణ రాత్రి 11.38 గంటలకు ముగియనుంది. ఇందులో భాగంగా రామభక్తులు 42 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయనున్నారు.





