News

హిందూఫోబియాపై చర్యలు తీసుకునే తీర్మానానికి లండన్ అసెంబ్లీ ఆమోదం

274views

యునైటెడ్ కింగ్‌డమ్‌లో పెరుగుతున్న హిందూ ఫోబియా మరియు హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలపై బ్రిటిష్ హిందూ లేబర్ అసెంబ్లీ సభ్యుడు కృపేష్ హిరానీ ప్రవేశపెట్టిన తీర్మానం లండన్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

యూకేలో పెరుగుతున్న హిందూ వ్యతిరేక ఘటనలను ఎదుర్కోవడానికి పోలీసులు మరియు హిందూ సమాజం మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఈ తీర్మానం ఉపయోగపడనుంది.

“హిందూఫోబియా అంశం సరైనది కాదని… దురదృష్టవశాత్తూ, గత సంవత్సరంలో హిందూ కమ్యూనిటీ లక్ష్యంగా ద్వేషపూరిత నేరాలు పెరిగాయని” కృపేష్ హిరానీ తెలిపారు. హిందూ వ్యతిరేక, ద్వేషపూరిత నేరాలను అధికారికంగా గుర్తిస్తేనే వాటిని సమర్థవంతంగా పరిష్కరించగలమని ఆయన నొక్కి చెప్పారు.పోలీసులు మరియు హిందూ సమాజం మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో మెట్రోపాలిటన్ పోలీసులను జవాబుదారీగా ఉంచడానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. 2022-2023 గణాంకాల ప్రకారం హిందువులపై 291 ద్వేషపూరిత నేరాలు జరిగాయని, ఇంగ్లండ్ మరియు వేల్స్‌లో హిందువులకు వ్యతిరేకంగా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 3 శాతం ఉన్నాయని పేర్కొన్నారు.