
1.2kviews
పిల్లలో మానసిక వికాసం , చిన్నారుల్లో దాగివున్న నైపుణ్యత మెరుగుపరచడం (Skills Development), పిల్లలో ఉత్సహం నింపటం కోసం వేసవి కాలంలో ఆరెస్సెస్ నంద్యాల శాఖ బాలల విహారాయాత్ర ఏర్పాటు చేసింది. నంద్యాల నగరం లో 26.05.2019 ఆదివారం బాల విహార పేరుతో బాగ్ 1 ,2 లో ఉన్న చిన్నారులతో ఒక్కరోజు వర్గ మహానంది గ్రామానికి 3 km దూరంలో ఉన్న “ శ్రీ జిన శంకర తపోవనం ( రమణ మహర్షి ఆశ్రమం)“లో నిర్వహించారు. ఈ సందర్భంగా బాగ్ 1 కార్యవాహ శ్రీ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభ అందరి ముందు ప్రదర్శించడం నేర్పామన్నారు. పిల్లలు హాస్యం, మిమిక్రి, కథలు , ఆటలు వంటి విషయాలు ఈ ఒకరోజు వర్గలో నేర్చుకుంటూ అందరి ముందు ప్రదర్శించారు. కార్యక్రమ నిర్వహణ కోసం ఆశ్రమ వర్గాలు అన్ని విధాలుగా సహకరించాయి. ఆశ్రమంలోని మాతృమూర్తులు స్వయంగా వండి పిల్లలకు వడ్డించారు. అప్పుడప్పుడు ఇలాంటి విహార యాత్రల వలన పిల్లలు మానసిక వత్తిడికి లోనుకాకుండా ఉంటారని, వారిలో బుద్ధి పెరుగుదల, తెలివి తేటలు ,ధైర్యం ,మంచి నడవడిక, చదువుపై మంచి అవగాహన వస్తుందని ముఖ్య అతిథి శ్రీ మీసాల సుబ్బారావు వివరించారు.ఈ వర్గలో 34 మంది బాల స్వయంసేవకులు ,12 మంది తరుణ స్వయంసేవకులు పాల్గొన్నారు.





