News

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ అధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు క్యాన్సర్, గర్భకోశ వ్యాధులపై అవగాహన, వైద్య శిబిరం

1kviews

నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నందు మహిళా ఉపాధ్యాయులకు క్యాన్సర్, గర్భకోశ వ్యాధులపై అవగాహన మరియు వైద్య శిబిరము నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టీ. వీ లక్ష్మి, జయభారత్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం. సత్యప్రియ పాల్గొని వైద్య సలహాలు అందజేశారు.

డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధిపై అవగాహన లేక చాలామంది చనిపోతున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి యొక్క లక్షణాలను గుర్తించి వెంటనే పరీక్షలు చేయించుకున్నట్లయితే నివారించవచ్చు అని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలను వివరించారు. ఉపాధ్యాయినులు గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు, పిల్లలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించాలని కోరారు. ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ లక్ష్మి తెలిపారు.

డాక్టర్ సత్యప్రియ స్త్రీలలో గర్భకోశానికి సంబంధించి వచ్చే సమస్యల గురించి ఉపాధ్యాయినుల సందేహాలను నివృత్తి చేశారు. ఉపాధ్యాయినులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా నిపుణుడు శ్రీ ఆనందరెడ్డి మాట్లాడుతూ ఆనందంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర గిరిజన కాలనీలోని వికలాంగ బాలునికి వీల్ చైర్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ బాలు సుబ్బారావు, జనరల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ పాల్గొన్నారు.