
ధర్మనిష్ట, ఆచారాలు సంప్రదాయాలు పాటించే వ్యక్తి ద్వారా నే సమాజం పురోగతి సాదిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ ప్రకాశం జిల్లా సహ కార్యవాహ్ మక్కపాటి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రాధమిక శిక్షా వర్గ ముగింపు సందర్భంగా మార్కాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.వందల సంవత్సరాల నుంచి మన ధర్మం పై దాడులు జరుగుతూనే ఉన్నాయి అని, ఎన్ని దాడులు జరిగిన హిందూ ధర్మం తట్టుకుని నిలబడింది అన్నారు. సాంప్రదాయాలు, ఆచారాలు పాటించే వ్యక్తుల మూలంగానే ఇది సాధ్యం అయింది అని అన్నారు. అలాంటి సమాజం కోసమే ఆరెంజ్ పనిచేస్తుంది అన్నారు. సనాతన హిందూ సాంప్రదాయాలు కాపాడుకునేందుకు మనమంతా సంఘటితంగా ఉండాలని ఆకాంక్షించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ మేడ బదరీనాథ్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం పట్ల అవగాహన, భక్తి పెంచుకోవాలి అన్నారు. ఇందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. కార్యక్రమం లో నగర సంఘచాలక్ పానుగంటి శ్రీనివాస్, వర్గ కార్యవాహ్ నాగబ్రహ్మాచారి, ఆర్ఎస్ఎస్ నాయకులు విశ్వం, సూర్యనారాయణ బాబు, కొండా మల్లికార్జున రెడ్డి, మందటి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా కార్యకర్తలు ప్రదర్శించిన యోగా,దండ ప్రయోగం బాగా ఆకట్టుకుంది.





