News

నవంబర్-3 : భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ పుట్టిన రోజు

285views

నేడు భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ పుట్టిన రోజు (నవంబర్ 3, 1933)లో బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో జన్మించారు. 1941లో ఉన్నత పాఠశాల విద్య ఢాకాలో పూర్తి చేసుకున్నాడు. 1947లో దేశ విభజన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి విశ్వభారతి, ప్రెసిడెన్సీ కళాశాలలో అభ్యసించారు. ఆయన భారతీయ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం, పేదరికానికి కారణాలు, పొలిటికల్ లిబరలిజంలలో చేసిన విశేష కృషికి 1998లో నోబెల్ బహుమతి లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి సల్పినందుకు 1999లో భారతరత్న పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం సత్కరించింది.