News

వైభవంగా ప్రారంభమైన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

310views

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. సకల దేవతలు కదిలిరాగా పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం అంకురార్పణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు సేకరించిన మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అర్చకులు అంకురింపజేశారు. ఈ సందర్భంగా సంకల్పం, విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. రాత్రి స్వామివారు శేషవాహనంపై పరావాసుదేవ అలంకారంలో తిరు వీధుల్లో విహరించారు.