
హిందూ స్వయంసేవక్ సంఘ్-హెచ్‌ఎస్‌ఎస్ రక్షా బంధన్‌ను యూనివర్సల్ వన్‌నెస్ డే అని కూడా పిలుస్తారు, ఈ రోజు సమాజంలో ఐక్యత, ప్రేమ మరియు రక్షణ విలువలను తెలియజేస్తుంది. రక్షా బంధన్, సాంప్రదాయ హిందూ పండుగ, మన కుటుంబాలను, సమాజాన్ని రక్షించే బాధ్యత భావనను ప్రోత్సహిస్తుంది. ఈ వేడుక మానవాళి మధ్య పరస్పర అవగాహనను సూచించడంతో పాటు విభిన్న వర్గాల మధ్య సామరస్యాన్ని అవగాహనను పెంపొందించడంలో ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
ఈ సంవత్సరం, హిందూ స్వయంసేవక్ సంఘ్-హెచ్‌ఎస్‌ఎస్ అమెరికాలోని 20 రాష్ట్రాలలో రక్షా బంధన్ వేడుకలను నిర్వహించింది. సమాజ భద్రత మరియు శ్రేయస్సు కోసం తమ జీవితాలను అంకితం చేసే పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పౌర అధికారులతో పాటు సమాజంలోని వివిధ సేవలను అందిచే వ్యక్తులకు రాఖీలు కట్టారు. మన సమాజాన్ని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేసే వారి త్యాగాలు మరియు అంకితభావాన్ని ఈ రక్షా బంధన్ గుర్తిస్తుంది.రక్షా బంధన్ సాంప్రదాయ సోదర-సోదరీ సంబంధానికి మించినదని, సమాజంలోని సభ్యులందరూ తమ కుటుంబాలను, సమాజాన్ని రక్షించే బాధ్యతను స్వీకరించాలని హిందూ స్వయంసేవక్ సంఘ్ కోరింది.
చికాగోలో ఈ సంవత్సరం జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటు సందర్భంగా హెచ్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పలువురికి రాఖీలు కట్టారు. విభిన్న విశ్వాస వర్గాల మధ్య సామరస్యాన్ని మరియు అవగాహనను పెంపొందించడంలో హెచ్‌ఎస్‌ఎస్ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేసింది. మతపరమైన, సాంస్కృతిక భేదాలు ఉన్నప్పటికీ, ఉమ్మడి మానవత్వాన్ని పెంపొందించుకోవడం అందరి కర్తవ్యం అనే ఆలోచనను హిందూ స్వయంసేవక్ సంఘ్ తెలియజెప్పింది.
“#UniversalOnenessDay అనేది మనం భాగమైన సంఘానికి మద్దతు ఇవ్వడానికి, రక్షించాలనే సామాజిక, పౌర బాధ్యతలను పునరుద్ఘాటించడానికి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది.ఏకత్వం ప్రాముఖ్యత గురించి మాట్లాడటం చాలా బాగుంది. రక్షా బంధన్ వేడుకలు జరిపినందుకు హిందూ స్వయంసేవక్ సంఘ్-హెచ్‌ఎస్‌ఎస్ కి ధన్యవాదాలు!” అని ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ అడ్రియన్ జాన్సన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.





