News

తొలిసారి మహాచండీ అలంకారంలో బెజవాడ దుర్గమ్మ

260views

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ తొలిసారి మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చండీదేవి అలంకారంలో జగన్మాతను ఈ నెల 19న వీక్షించే అవకాశం భక్తులకు లభించనుంది. మరోవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిని విద్యుత్తు దీపాలతో అలంకరించారు.