News

నేడు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

318views

అక్టోబర్‌ 15–23వ తేదీ వరకు జరగనున్న శ్రీవా­రి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ­హించనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధు­ల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మం­డపంలో ఆస్థానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి­రోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు జరుగుతా­యి. బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబర్‌ 15న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ ని­ర్వ­హిస్తారు.

మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరు­మల ముస్తాబైంది. తిరుపతి/తిరుమలలో ఎటు చూసి­నా నవరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్లను అతికించారు. వైభ­వం మండపం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పూల మొక్కల నడుమ అనంతపద్మనాభ స్వామి నమూ­నా ఆలయం ఆకట్టుకుంటున్నాయి. రామాయణం గుర్తు చే­సే విధంగా రామ, లక్ష్మణ, భరత, శతృజు్ఞలను దశరధుడు ఉయ్యాలలో ఊపే ఊహా చిత్రాన్ని సుందరంగా చిత్రీకరించారు. విద్యుత్‌ వెలుగులతో తిరుమలగిరి, ఆలయ మహాగోపురాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.