News

శ్రీ కృష్ణ జన్మభూమి కేసు విచారణకు అలహాబాద్ హైకోర్టుకు హిందూ పక్షం దరఖాస్తు

89views

ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు మధ్య కొనసాగుతున్న భూ వివాదానికి సంబంధించిన కేసుల విచారణ అలహాబాద్ హైకోర్టులో త్వరలో ప్రారంభం కానుంది. అయోధ్య రామజన్మభూమి వివాదం తరహాలో జిల్లా కోర్టులో కాకుండా నేరుగా హైకోర్టులో కేసు విచారించనున్నారు. ఇందుకు హైకోర్టు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం, హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ముస్లిం పక్షం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి స్టే విధించలేదు.

ఈ నేపధ్యంలో కేసు విచారణను త్వరగా ప్రారంభించాలని, విచారణ కోసం విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ పక్షం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రితింకర్ దివాకర్‌కు దరఖాస్తు పంపింది. ఐదు రోజుల సెలవుల కారణంగా ప్రస్తుతం ఈ-మెయిల్ ద్వారా అప్లికేషన్ ను డిజిటల్ విధానంలో పంపారు. మంగళవారం కోర్టు ప్రారంభమైన తర్వాత హార్డ్ కాపీని హిందూ తరపు న్యాయవాదులు విష్ణు శంకర్ జైన్ ప్రభాష్ పాండేలు ప్రధాన న్యాయమూర్తికి అందజేయనున్నారు.