News

తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

182views

శ్రీవారి సర్వదర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా రింగ్ రోడ్డు లోని క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. క్యూలైన్లోని భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలను తితిదే అధికారులు ఏర్పాటు చేశారు.