201
అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు తానేదార్ భారతీయ సంతతికి చెందిన వారి హక్కులను కాపాడేందుకు ముందడుగు వేశారు.మతపరమైన వివక్షను పరిష్కరించడానికి, అమెరికాలోని హిందూ, బౌద్ధ, సిక్కు, జైన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆయన ఒక కాకస్‌ను ప్రారంభించారు.
వాషింగ్టన్ DCలో శుక్రవారం ఆయన మీడియా ముందు హిందూ, బౌద్ధ, సిక్కు, జైన కాకస్‌లకు సంబంధించిన పోస్టర్‌లను చూపి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
అమెరికాలో మత వివక్షను ఎదుర్కోవడం, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులకు మత స్వేచ్ఛను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని ఆయన అన్నారు. తానేదార్ చర్యను అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు స్వాగతించాయి.