News

2000 రూపాయల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు

167views

2000 రూపాయల నోట్ల మార్పిడి, డిపాజిట్ కు భారతీయ రిజర్వ్ బ్యాంకు-ఆర్బీఐ ఇచ్చిన గడువు నేటీతో తీరనున్నది. రేపటి నుంచి 2వేల రూపాయల నోటు చెల్లకుండా మిగిపోతుంది. ఇప్పటికే చాలా మంది 2000 నోట్లను బ్యాంకులలో జమచేయగా.. మరికొందరూ ఇతరత్రా లావాదేవీల ద్వారా ఆ నోట్లను మార్పిడి చేసుకున్నారు. ఇంకా నోట్లను మార్చుకోనివారికి వారికి ఈ రోజే చివరి అవకాశం. నేడే బ్యాంకులకు వెళ్లి తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.

‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని, ఈ ఏడాది మే 19న, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది.