News

విశాఖ సింహాచలం అప్పన్న ఆర్జిత సేవలు పునః ప్రారంభం

191views

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈ నెల 24 నుంచి అయిదు రోజుల పాటు జరిగిన వార్షిక తిరు పవిత్రోత్సవాలు గురువారం దేవతామూర్తుల ఏకాంత స్నపనంతో సంప్రదాయబద్ధంగా పరిసమాప్తం అయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, రథబలి నిర్వహించారు. గురువారంస్వామివారి ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామికి ఏకాంతంగా స్నపనం నిర్వహించారు. ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆర్జిత సేవలు యథావిధిగా పునః ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం జరిగింది. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు సుమారు 2.01 కోట్లు సమకూరినట్లు ఈవో పేర్కొన్నారు. దీంతో పాటు 136 గ్రాముల బంగారం, 15.250 కిలోల వెండి లభ్యమైనట్లు వివరించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నాణేలు కూడా వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తం ఆదాయం 35 రోజులదని తెలియజేశారు.