News

అవయవదానం దేశభక్తిలో భాగం : సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్

342views

అవయవదానం దేశభక్తిలో భాగమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా.మోహన్ భగవత్ గారు అన్నారు.సూరత్ లోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియంలో బుధవారం డొనేట్ లైఫ్ కార్యక్రమంలో అవయవాలు దానం చేసిన 63 కుటుంబాలను ఆయన సన్మానించారు.

ఈ సందర్బంగా సర్ సంఘ్ చాలక్ డా.మోహన్ భగవత్ గారు ప్రసంగించారు. చనిపోయిన తర్వాత, శరీరం ఎవరికైనా ఉపయోగపడగలిగితే.. అలాంటి వ్యక్తి అవయవాన్ని దానం చేసేందుకు వారి కుటుంబాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం మరణించిన తర్వాత మన శరీరంలోని ఏదైనా అవయవం ఇతరులకు ఉపయోగపడుతుంది అంటే కచ్చితంగా అవయవదానం చేయాలని.. అదే మానవధర్మమని డా.మోహన్ భగవత్ గారు ఉద్ఘాటించారు