News

శాస్త్ర సాంకేతిక సేవకులకు కేంద్రం కొత్త పురస్కారాలు

232views

శాస్త్ర సాంకేతిక రంగంలో పురస్కారాల ప్రదానానికి అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వివిధ సైన్స్‌ విభాగాలు ఇప్పటిదాకా అందిస్తున్న దాదాపు 300 అవార్డులను రద్దు చేసింది. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల రంగంలో విశిష్ట సేవలు అందించేవారిని గౌరవించేందుకు ‘రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌’ పేరిట కొత్త జాతీయ అవార్డులను ఆవిష్కరించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనలో వివరాలు తెలియజేసింది. రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారాల్లో నాలుగు రకాలుగా ఉండనున్నాయి. అవి.. విజ్ఞాన్‌ రత్న, విజ్ఞాన్‌ శ్రీ, విజ్ఞాన్‌ యువ- శాంతిస్వరూప్‌ భట్నాగర్‌, విజ్ఞాన్‌ బృందం. శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల రంగంలో దక్కే అత్యున్నత గుర్తింపుల్లో ఒకటిగా రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారం నిలవనుంది. ఈ రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారం కింద ధ్రువీకరణ పత్రంతోపాటు పతకాన్ని అందజేస్తారు.