News

దేశవ్యాప్తంగా 290 ప్రాంతాల్లో శ్రీరామ రాతిస్తంభాలు

267views

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తికానున్న నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక ప్రకటన చేసింది. శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు ప్రాముఖ్యతను తెలియజెప్పేలా దేశవ్యాప్తంగా 290 ప్రాంతాల్లో శ్రీరామ రాతిస్తూపాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఆ వ్యయమంతటినీ అశోక్‌ సింఘాల్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ భరిస్తుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. స్తంభాలను ఏర్పాటుచేసే ప్రాంతాలకు సంబంధించి వాల్మీకి రామాయణంలో ఉన్న స్థల పురాణం లాంటి వివరాలను కూడా స్థానిక భాషలోనే అందరికీ అర్థమయ్యే విధంగా వాటిపై ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. మొదటి శ్రీరామ రాతిస్తూపం సెప్టెంబరు 27న అయోధ్యకు చేరుకుంటుందని.. దాన్ని మణి పర్వతంపై ప్రతిష్ఠిస్తామని చెప్పారు.