Seva

శ్రీ భారతి నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందు పంపిణి

1.2kviews

వంబర్ 22, 23 తేదీలలో నెల్లూరు జిల్లా గూడూరు తూర్పు వీధిలోని శ్రీ భారతి నవ నిర్మాణ్ సమితి అధ్వర్యంలో గూడూరులోని పలు హాస్టల్స్ లో స్వైన్ ఫ్లూ, డెంగ్వ్యూ లకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. నగరంలోని నరసింగ రావు పేటలోని బి.సి హాస్టల్లోనూ, బాల సదనంలోను స్వైన్ ఫ్లూ, డెంగ్వ్యూ నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సమీపంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల గదులకు వెళ్లి వారికి కూడా ఈ మందులను వేశారు. వారికి స్వైన్ ఫ్లూ, డెంగ్వ్యూ రాకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఆ వ్యాధులు రాకుండా హోమియో మందులు ఏ విధంగా నివారిస్తాయో కూడా వివరించారు.

వర్షాలు, చలి కాలం కావడంతో స్వైన్ ఫ్లూ, డెంగ్వ్యూల తోపాటు విష జ్వరాలు వ్యాపించే అవకాశం వుంది కనుక విద్యార్థులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. అందుకోసమే తాము ముందు జాగ్రత్తగా నివారణ మందులను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భారతి నవ నిర్మాణ్ సమితి కార్యదర్శి శ్రీ నంబూరు సుబ్బారావు, సభ్యుడు వంగా ప్రసాద్ రెడ్డి, బి. సి హాస్టల్ వార్డెన్ శ్రీమతి అన్నపూర్ణ పాల్గొన్నారు.