
కర్నూలు నగరంలోని వైష్ణవ ఆలయాల్లో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాత నగరంలోని రాంభొట్ల ఆలయంలో శాస్త్రోక్తంగా అభిజిత్ లగ్నంలో కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. అశోక్‌నగర్‌లో ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి, ద్వారకామాయి సాయిబాబా దేవస్థానంలో శ్రీరామనవమి మహోత్సవం, స్రీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తుంగభద్ర నది ఒడ్డున వెలసిన సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో, కొత్తపేటలోని కోదండరామాలయంలో సీతారాముల కల్యా ణోత్సవం నిర్వహిచారు. బళ్లారి చౌరస్తాలోని హనుమాన్ ఆలయంలో, జడ్పీ ఆవరణలోని ఓంకారేశ్వరీ సహిత ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారా ముల కల్యాణ వేడుకలు నిర్వహించారు. 19వ వార్డు మారుతీనగర్‌లోని మా రుతీ రామేశ్వర ఆలయం, 21వ వార్డు డాక్టర్స్ కాలనీలోని శ్రీసీతారాముల ఆల యంలో శ్రీరామనవమి కార్యక్రమాలు జరిగాయి. ఇస్కాన్ మందిరంలో శ్రీరా మనవమి సందర్భంగా సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరశివారు జోహరాపురంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, పాతనగరం ఎస్ నాగప్ప వీధిలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో, వడ్డెగేరి కోదండ రామాలయంలో, స్థానిక రెవెన్యూ కాలనీలోని భరతమాత ఆలయంలో, షరీన్‌నగర్‌లోని సద్గురు త్యాగరాజ రామాలయంలో, బుధవారంపేటలోని ఈశ్వర ఆంజనేయ స్వామి ఆలయంలో, గణేశ్‌నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో, మామిదాలపాడులోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో, కల్లూరు శ్రీరామాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు.





