
267views
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని పంపనూరు సమీపంలోని కొండపై మలోబుల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా దిగువకు తోడ్కొని వచ్చారు. అనంతరం రథం పైకి చేర్చి.. రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తజనంతో కొండప్రాంతం కిక్కిరిసి పోయింది. కొండపై స్వామివారి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు దర్శించుకుని మొక్క తీర్చుకొన్నారు. రథోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత దీపాలతో అలంకరించారు. దాతలు భక్తులకు అన్నదానం చేశారు.





