News

హిజాబ్‌ ధరించి పరీక్షలు రాస్తాం.. ముస్లిం విద్యార్థినుల వింతపోకడ!

220views

హిజాబ్‌ ధరించి వార్షిక పరీక్షలు రాయడానికి అనుమతించాలని కోరుతూ ముస్లిం బాలికలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతామని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది. హిజాబ్‌ ధారణను నిషేధిస్తూ కర్ణాటక సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ప్రయివేటు విద్యాసంస్థలు మాత్రం హిజాబ్‌ ధరించడానికి అనుమతిస్తున్నాయి. అయితే మార్చి 9 నుంచి జరిగే వార్షిక పరీక్షలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లోనే రాయాల్సి ఉన్నందున ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివే ముస్లిం బాలికలు కోర్టును ఆశ్రయించారు. అసలు పరీక్షల సమయంలో ప్రభుత్వ సూచనలు పాటించాలే తప్పా మతాలకు సంబంధించిన చాదస్త పోకడలకు ముస్లిం విద్యార్థినులు పోవడం విచిత్రంగా ఉంది. భారతదేశంలో అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి. కానీ ముస్లింలు మాత్రం తాము ప్రత్యేకం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఎంతమాత్రం సరైన విధానం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పరీక్షల విషయానికి వస్తే.. మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో హిజాబ్‌ ధరిస్తాం అని ముస్లిం విద్యార్థినులు కోరడం వింత పోకడగా ఉంది.