News

పాకిస్తాన్ లోని కరాచీ పోలీసు ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదుల దాడి

253views

పాకిస్తాన్‌లోని కరాచీలో గల పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగింది. చాలా మంది సాయుధులు పోలీసుల మీద కాల్పులు జరిపారు. పోలీసులు, సాయుధుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. దాడి చేసిన వారు గ్రెనేడ్లు కూడా విసిరారు.
ప్రధానకార్యాలయంలో విద్యుత్‌ను ఆపివేశారు. అన్ని ద్వారాలను మూసివేశారు. ఇతర ప్రాంతాల నుంచి పోలీసులు ప్రధాన కార్యాలయం దిశగా కదిలారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం 8 నుంచి 9 మంది సాయుధులు ఉన్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు అందలేదని సింద్ ప్రభుత్వ ప్రతినిధి అన్నారు.