
260views
ఒడిశాకు చెందిన ప్రముఖ భాషావేత్త, జానపద రచయిత మహేంద్ర కుమార్ మిశ్రాను ప్రతిష్టాత్మక యునెస్కో అంతర్జాతీయ మాతృభాష అవార్డు-2023కు ఎంపికయ్యారు. దేశంలో మాతృభాష ప్రాచుర్యానికి ఆయన జీవితకాలం చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ నెల 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢాకాలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.





