News

కమనీయం… వాసుదేవుని కల్యాణం

267views

శ్రీకాకుళం జిల్లా మందసలో కొలువుదీరిన దేవదేవుడు.. లోకనాయకుడు.. వాసుదేవుని కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మందసలోని వాసుదేవ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణ వేదికకు చేరుకున్న బ్రహ్మాండ నాయకుడ్ని ఆహోబిల, దేవనాధ్‌ త్రిదండి జీయర్‌స్వామిలు పెళ్లికొడుకును చేశారు. మధ్యాహ్నం 12 గంటల శుభ ముహూర్తాన కల్యాణ వేడుక నిర్వహించారు. వేలాదిమంది భక్తులు ఈ వేడుకను చూసి పులకించారు. ఆహోబిల త్రిదండి జీయర్‌స్వామి ఆధ్వర్యంలో పూజ లు, హోమాలు చేశారు. కోలాటాలు, అన్నమయ్య సంకీర్తనలు, పొందల శ్రీనివాస్‌ కచేరి అలరించాయి. సాయంత్రం గరుడ వాహన సేవలో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాజమండ్రికి చెందిన కుమారి హరిప్రియ కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. మందస ఎస్‌ఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు చేపట్టారు.