
పోర్చుగీస్ క్యాథలిక్ చర్చిలో 4,000 కంటే ఎక్కువ మంది పిల్లలు చర్చి ఫాదర్ల చేత లైంగిక వేధింపులకు గురైనట్లు పెడ్రో స్ట్రెచ్ అనే పిల్లల మానసిక వైద్యుడు పలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గత డెబ్బై ఏళ్ల లెక్కలను బయట ప్రపంచానికి ఆయన తెలియజేశారు. ఈ గణాంకాలు కేవలం చాల తక్కువేనని ఆయన స్పష్టం చేశారు.
ఆ నివేదికల ప్రకారం.. బాధితుల్లో ఎక్కువ మంది బాలురు ఉన్నారని.. దీంతోపాటు పెద్దలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. క్యాథలిక్ పాఠశాలలు, చర్చిలు, ఫాదర్ల గృహాల్లో వేధింపులు జరిగాయని డాక్టర్ తెలియజేశారు. పది నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలు హింసకు గురవుతున్నారని తెలిపారు. ప్రార్థనల నేపంతో రెండేళ్ల చిన్నారిని కూడా వేధించారని ఆయన అన్నారు. అయితే 20 ఏళ్ల క్రితం జరిగిన నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోలేమని, కొత్త చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాలల కమిషన్ తెలిపింది.





