
ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కర్ణాటక కాగినెలె కనకదాసు గురుపీఠ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ నిరంజనానందపురి మహాస్వామి, కర్ణాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్.ఎం.రేవణ్ణ, కర్ణాటక వెనుకబడిన కులాల ఫెడరేషన్ ప్రెసిడెంట్ బి.కే.రవి తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మించేందుకు అవసరమైన ఒక ఎకరా భూమిని కేటాయించాలని సీఎంను పీఠాధిపతి, తదితరులు కోరగా.. సీఎం జగన్ దానికి సానుకూలంగా స్పందించారు. తిరుమల క్ష్రేత్రంలో తమ కురబ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదని, లక్షలాదిమంది స్వామి వారి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని సీఎంకి పీఠాధిపతి వివరించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కీర్తనలు, ప్రసస్ధ్యానికి తమ పీఠానికి ఉన్న చరిత్రను ముఖ్యమంత్రితో మహాస్వామి పంచుకున్నారు.





