
333views
దేశంలో 1951 నుంచి ఇప్పటి వరకు ఓటర్ల సంఖ్య దాదాపు 6 రెట్లు పెరిగింది. 2023 జనవరి 1 నాటికి దేశంలో మొత్తం 94,50,25,694(94 కోట్ల 50 లక్షలు) మంది ఓటర్లు ఉన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1951లో దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు 17.32 కోట్ల ఓటర్లు ఉండగా, వారిలో 45.67 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని 75 శాతానికి పెంచాలని ఎన్నికల సంఘం ప్రయత్నించినప్పటికీ, మూడింట ఒక వంతు (30 కోట్ల) మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేదు. దాంతో 91.20 కోట్ల మంది ఓటర్లకు 67.40 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఓటు వినియోగించుకోని వారిలో అధికంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత, వలసదారులు ఉన్నారు.





