News

ఆకాశమే హద్దుగా సత్తా చాటిన అవని చతుర్వేది.. యుద్ద విన్యాశాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత!

330views

భారతీయ అతివ ఆకాశమే హద్దుగా సత్తా చాటుతోంది. దేశం బయట వైమానిక యుద్ధ క్రీడలో పాల్గొన్న మొదటి మహిళా యుద్ధ విమాన పైలట్‌గా భారత వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ అవనీ చతుర్వేది నిలిచారు. జపాన్‌లోని హ్యాకురి ఎయిర్‌ బేస్‌లో జనవరి 12-26వ తేదీల మధ్య భారత్‌, జపాన్‌ వాయుసేనలు నిర్వహించిన సంయుక్త విన్యాసాల్లో ఆమె పాల్గొన్నారు. అవని ఎస్‌యూ-30ఎమ్‌కేఐ కి పైలట్‌గా ఉన్నారు. అంతర్జాతీయస్థాయి వైమానిక యుద్ధ క్రీడలో పాల్గొనడం ఇదే మొదటిసారని, తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అవని చతుర్వేది తెలిపారు.