News

ఇస్రో రెండో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం… అది ఎక్కడంటే?

324views

ఇంధనాన్ని ఆదా చేసి పేలోడ్‌ సామర్థ్యాన్ని పెంచడానికి ఇస్రో రెండో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టినాన్ని రెండో లాంచింగ్‌ ప్రయోగ వేదికకు ఎంపిక చేసుకుంది. దీనికోసం 2019లోనే భూ సేకరణను సైతం ప్రారంభించారు. మొత్తం 2,376 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే కొంత భూసేకరణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇక్కడ పనులు ప్రారంభించనున్నారు. ఈ స్పేస్‌పోర్టు నిర్మాణమంతా షార్‌ ఆధ్వర్యంలో జరగనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా రూ.926 కోట్లు కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటైతే ఉద్యోగావకాశాలతోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. 500 కిలోల కంటే తక్కువ బరువున్న చిన్న ఉపగ్రహాల (స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ – ఎస్‌ఎ్‌సఎవ్వీ)ను ప్రయోగించేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది. ఇస్రో మరో ఎస్‌ఎ్‌సఎల్వీ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 10న ఏపీలోని శ్రీహరికోట నుంచి ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ2 ప్రయోగం చేపట్టనుంది. ప్రయోగానికి సంబంధించిన రాకెట్‌ అనుసంధాన ప్రక్రియను ఆదివారం ప్రారంభించారు. రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించారు.