News

భారత ప్రభుత్వ సార్వభౌమత్వం పైన దాడి. అబ్దుల్లా – ముఫ్తీ ల పై తగిన చర్య తీసుకోవాలి – విశ్వ హిందూ పరిషత్.

673views

ముగ్గురు మాజీ ముఖ్య మంత్రులు, నేషనల్ కాంగ్రెస్ మరియు పీ డీ పీ కి చెందిన ప్రముఖ నేతల పై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ, వీరి పై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేతలు తరచూ చేస్తున్న భారత వ్యతిరేక వ్యాఖ్యలు మరియు బెదిరింపుల వలన కాశ్మీర్ లోయలోని అధిక సంఖ్యాకులు అయిన  ముస్లిము  లు మరియు అల్ప సంఖ్యాకులైన ముస్లిమేతర వర్గాల ప్రజల మధ్య పెరుగుతున్న వైషమ్యాలను ఉటంకిస్తూ విశ్వ హిందూ పరిషత్ యొక్క ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం అధికారులను కలిసి  తమ   ఆరోపణ లను తెలియజేసింది..
వీ హెచ్ పీ యొక్క అంతర్జాతీయ అధ్యక్షుడు, అడ్వకేట్ శ్రీ  ఆలోక్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రతినిధి బృందం ఎన్నికల సంఘం తో మాట్లాడుతూ,జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా మరియు మెహబూబా ముఫ్తీ లు పాకిస్థాన్ చేతిలో తోలు బొమ్మలుగా మారి ఆర్టికల్ 370 మరియు 35A కి వ్యతిరేకంగా తరచూ కాశ్మీర్ లోని అధిక సంఖ్యాకులు అయిన ముస్లిం ప్రజలను అక్కడి వాతావరణాన్ని ఉద్దేశ్య పూర్వకంగా, ప్రణాళికా బద్ధంగా మరింత కఠిన ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా మార్చాలనే కుటిల యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాక ఆదర్శవంతమైన ఎన్నికల విధానాన్ని ఉల్లంఘిస్తున్న వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికల సంఘానికి తగిన సాక్ష్యాలు ఉన్న దస్తావేజులు అందిస్తూ, ఏ నేతలు భారతీయ సార్వభౌమ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారో వారిని,
అక్కడి బహు సంఖ్యాక ముస్లిముల పేరుతో ప్రజలని, భారతదేశాన్ని ముక్కలు చేయాలని  రెచ్చగొడుతున్న  నేతల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం వారికి హామీ ఇచ్చింది.
. వి హెచ్ పీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన నాలుగు పేజీల విస్తృత  ఫిర్యాదులో ఈ  ముగ్గురు మాజీ ముఖ్య మంత్రులు కాశ్మీర్ ను భారత దేశం నుండి వేరు చేస్తామనే బెదిరింపు తో పాటు ఎలాంటి పదాలను ఉపయోగిస్తూ మాట్లాడుతున్నారో చెపుతూ దీనిని బట్టి  ఈ నేతలు పాకిస్థాన్ చేతిలో పావులుగా మారి భారత శత్రు దేశాన్ని సమర్థి స్తున్నార ని తెలుస్తోందనీ పేర్కొన్నారు.
ఇంకా  ఫిర్యాదు లో  ఈ నేతలు తరచూ కాశ్మీర్ లోని అధిక సంఖ్యాక ముస్లిం జనాభా యొక్క  స్వాతంత్య్రం గురించి ఎక్కువగా మాట్లాడటం, విషయాన్ని మత పరమైన అంశంగా మార్చి ,అక్కడ నివసిస్తున్న ఇతర మతాలకు చెందిన అల్ప సంఖ్యాక ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి ప్రణాళికా బద్ధంగా చేస్తున్న  కుట్రగా పేర్కొన్నారు.
ఇంకా ఫిర్యాదులో  ఈ నేతలు ముస్లిం సంప్రదాయం ఆధారంగా ప్రజలని రెచ్చగొట్టి   బహిరంగంగానే  భారత దేశాన్ని ముక్కలు చేయాలనే ప్రయత్నాలను చేస్తున్నారనీ ఇది ఈ  నేతలు,  వారి సంబంధిత వర్గాలూ భారత దేశం యొక్క రాజ్యాంగాన్ని, దానిలో పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం, పార్లమెంటరీ విధానం, ఎన్నికల సంఘం యొక్క అధికారాలు,మొత్తంమీద భారత సార్వభౌమత్వం పైన సూటిగా  చేస్తున్న దాడిగాను చెప్పవచ్చు. ఇలా బాధ్యతా రహితంగా చేసే వ్యాఖ్యలు ఏ ప్రజాస్వామ్య దేశం లోనూ భావ వ్యక్తీకరణ స్వేచ్చగా పరిగణించడం జరగదు.
వీ హెచ్ పీ తన విజ్ఞాపన లో ,ఎన్నికల  సంఘం ఇటువంటి వ్యక్తుల పైన  ఎఫ్ ఐ ఆర్ ను నమోదు చేసి,వారి పై విచారణ చేపట్టి వారు ఎన్నికలలో పాల్గొనకుండా గతంలో వివిధ సందర్భాల్లో చేసినట్లు  నిషేధం విధించాలని కూడా కోరింది.