
274views
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న అంటే ఆదివారం రోజున స్వామివారిని 78,340 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 27,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.30 కోట్లు వచ్చింది. టికెట్ లేని సర్వదర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టికెట్ లేని సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (టోకన్) సర్వదర్శనానికి 4 గంటల సమయం, 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.





