News

మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి శేషవాహనం బహూకరణ

52views

బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి నెల్లూరుకు చెందిన దాతలు దివంగత మునగా హనుమంతరావు జ్ఞాపకార్థం ఆయన భార్య వరలక్ష్మి కుటుంబ సభ్యులు శుక్రవారం రూ. 6.5 లక్షలతో నూతన శేషవాహనాన్ని బహూకరించారు. ముందుగా శేషవాహనానికి అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి అనంతరం దాతలు వరలక్ష్మి, కుటుంబ సభ్యులు అనిల్‌కుమార్‌, అలేఖ్య, ప్రవీణ్‌కుమార్‌, హర్షితల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లు గ్రామోత్సవంలో ఈశేషవాహనంపైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ముందుగా వాహనాన్ని ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రమణ్యంనాయుడు, ఏసీ జె. వెంకటసుబ్బయ్య, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.