
భారతదేశం వ్యవసాయాధారిత దేశమని అందరికీ తెలిసిందే. సుమారు 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సలహా ఇచ్చారు. తృణధాన్యాలకు సంబంధించి మోదీ ఇచ్చిన సలహాపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
అమెరికాకు చెందిన ప్రముఖ చెఫ్ ఎయిటాన్ తో కలిసి బిల్ గేట్స్ ఇండియా రోటీని తయారు చేశారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఎయిటాన్ ఇటీవల భారత్‌లో పర్యటించి బీహార్ లోని గోధుమ రైతులను కలుసుకున్నారు. దీదీ కా రసోయ్ కమ్యూనిటీ క్యాంటీన్ మహిళలను కలుసుకుని రోటీలు చేయడం నేర్చుకున్నారని గేట్స్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశారు. వీడియోలో ఎయిటాన్, గేట్స్ ఇద్దరూ గోధుమ పిండి కలపడం, కాల్చడం, రుచి చూడటం చూపించారు. వీడియో వైరల్ కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. గేట్స్ మంచి పనిచేశారని ప్రశంసించారు. భారత్‌లో తృణధాన్యాల ట్రెండ్ నడుస్తోందని, ఈసారి మిల్లెట్స్‌లో రోటీ ట్రై చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి తృణధాన్యాల సంవత్సరం జరుపుకుంటోన్న వేళ ఆయన గేట్స్‌కు ఇచ్చిన సలహాకు ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయ ఆహారాన్ని ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు రూచి చూడటం ప్రత్యేకంగా చెప్పవచ్చు.